Saturday, May 1, 2010

Pachipulusu

 




కావలసినవి:

పచ్చి మిరపకాయలు: ౮
ఉల్లిపాయలు - ౨
ఉప్పు - ౩ టీ స్పూనులు
చింతపండు - 25 గ్రాములు






నునే - 3 / 4 టీ స్పూనులు
ఎండు మిరపకాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు.

తాయారు చేయు విధానం:
పచ్చి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలు గ కోసుకోవాలి. ఉల్లిపాయలు మాములు సైజు లో కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నునే పోసి స్టవ్ మీద పెట్టాలి. నునే కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత స్టవ్ కట్టేయ్యాలి. వేరే గిన్నె లో చింతపండు బాగా నానబెట్టాలి.

వేగిన పచిమిరపకయాలని ఒక గిన్నె లో వేసి, దానిలో ఉప్పు వేసి బాగా నాలాగా కొట్టాలి. పప్పుకుతి లాంటిది ఉంటె దానితో నలగాకోట్టవచు. అలా నలగగొట్టిన దానిలో చింతపండు నీళ్ళు పొయ్యాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు కలపాలి (పచివే. వేపల్సిన అవసరం లేదు). పచ్చి మిరపకాయలను వేపిన గిన్నె లోనే తాలింపు పెట్టి (ఎండు మిరపకాయలు, తాలింపు దిన్సులు, కరివేపాకు) తాలింపు ని పచ్చి పులుసు లో కలపాలి. పచ్చి పులుసు ని బాగా కలిపి ఉప్పు, పులుపు సరి చూసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం బెల్లం లేదా పంచదార కలపవచ్చు.

ఇంకా పచ్చి పులుసు రెడీ. మీ సూచనలు, సలహాలు సదా ఆహ్వానమే  :).

 


 

1 comment: