Saturday, May 1, 2010

Chicken Pulusu

కావలసినవి:
చికెన్ - 500 graamulu
ఉల్లిపాయలు - 2
టొమాటో - 1
ఉప్పు - ౩ టీ స్పూనులు
కారం - 1 . 5  టీ స్పూనులు
పసుపు - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - 4 టీ స్పూనులు
కొతిమీర - తగినంత
చికెన్ మసాల - 4 టీ స్పూనులు
నునే - 10 టీ స్పూనులు

ఉల్లిపాయలు, టొమాటో ముందుగ కోసి పెట్టుకోవాలి. చికెన్ చిన్న ముక్కలుగ కోసి ఒక గిన్నె లో వేసుకొని బాగా కడగాలి. దానిలో ఒక 5 టీ స్పూనుల నునే, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కరం, పసుపు వేసి బాగా కలపాలి. వేరే గిన్నె లో మిగిలిన నునే పోసి స్టవ్ మీద పెట్టాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగాక టొమాటో వేసి అది కూడా కొంచెం వేగాక.. ముందుగ కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసేయ్యాలి. అలా ఒక 5 లేక 10 నిముషాలు ఉంచక (కలుపుతూ ఉండాలి లేకపోతె అడుగంటిపోద్ది) నలుగు గ్లాసుల నీళ్ళు పొయ్యండి. గిన్నె మీద ఏదైనా మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. అలా ఒక 20 - 30 నిముషాలు ఉంచాలి. మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలు ఉడికేదాకా ఉంచాలి. చికెన్ ముక్క ఉడికాక చికెన్ మసాల, కొతిమీర వేసేసి ఒక 2 నిముషాలు ఉంచి దించేయ్యడమే.

అంతే వేడి వేడి చికెన్ పులుసు రెడీ :) మీ అభిప్రాయాలూ తెలుపగలరు.

No comments:

Post a Comment