Showing posts with label Telugu Pata. Show all posts
Showing posts with label Telugu Pata. Show all posts

Monday, July 2, 2012

Maa Telugu Talliki...

 


మా తెలుగు తల్లికి మల్లెపూదండ   

Telugu Talli

మా తెలుగు తల్లికి మల్లెపూదండ 
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.


గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.


అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా


రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం.

జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ !

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారక గీతం. శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు దీన్ని 1942 లో చిత్తూరు నాగయ్య గారి దీనబంధు చిత్రానికి రాసారు. పాడింది టంగుటూరి సూర్యాకుమారి గారు. సంగీతం అప్పు దినకర్ రావు గారు.
టంగుటూరి సూర్యకుమారి గారి పాట ఇక్కడ వినవచ్చు : http://www.youtube.com/watch?v=pVYKrO-mqps