Saturday, April 17, 2010

Making of Pappucharu

నాకు పప్పుచారు అంటే చాల ఇష్టం. మెల్ బోర్న్  వచ్చాకే పప్పుచారు చెయ్యడం నేర్చుకున్న. ఈ తయారీ విధానం ఎవరికైనా పనికోచిన రాకపోయినా.. కనీసం నేను మళ్ళీ చుస్కోవటానికి ఈజీ గ ఉంటుంది అని పోస్ట్ చేస్తున్న. మీ అభిప్రాయాలూ తెలుపగలరు.

కావలసినవి :
కందిపప్పు: 3 / 4 గ్లాసు
ఉల్లిపాయ: 1 (పెద్దది)
టొమాటో: 1 (పెద్దది)
పచ్చి మిర్చి: 2
ఎండు మిర్చి - 2
వెల్లుల్లి - ౩
ఉప్పు - ౩ టీ స్పూన్స్
కారం - 1 టీ spoon
తాలింపు దినుసులు,  కరివేపాకు.

తయారి:

పప్పు ని ముందుగా కుకర్లో ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువ పోసిన పర్వాలేదు. పప్పు ఉడుకుతున్నప్పుడే చింతపండుని ఒక గ్లాసు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. బాగా పిసికి పిప్పి తీసివెయ్యాలి. పప్పు ని  కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పప్పు ఉడికాక కొంచెం మెదిపితే మంచిది. ఉల్లిపాయ, టొమాటో కొంచెం పెద్ద ముక్కలు గ కొయ్యాలి. ఉల్లిపాయలు నిలువుగా ఐనా తరుగుకోవాచు. పెద్ద దాక (గిన్నె) లో నునే (4 - 5  టీ స్పూన్స్) పొయ్యాలి. నునే కాగాక, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక, టొమాటో ముక్కలు కూడా వెయ్యాలి. అవి కూడా వేగాక, మూడు గ్లాసుల నీళ్ళు పొయ్యాలి.

చింతపండు నీళ్ళని పప్పు లో వేసి బాగా కలపాలి. అల కలిపినా పప్పుని, దాక లో బాగా మరిగిన నీళ్ళలో కలిపెయ్యాలి. పప్పు బాగా కలిసేటట్టు బాగా తిప్పాలి. దానిలో సరి పద ఉప్పు (౩ టీ స్పూన్స్), కారం (1 టీ స్పూన్) వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాచు.

అది అలా మరుగుతూ ఉండగా, ఒక కంచుడు లో తాలింపు (పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎందు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు) పెట్టుకోవాలి. తాలింపు సిం లో పెడితే మంచిది.. మాడకుండా ఉంటుంది. తాలింపు వేగాక ఆ తాలింపు మరుగుతున్న పప్పు చారు లో కలిపెయ్యండి. అంతే వేడి వేడి పప్పు చారు రెడీ :)

చివర్లో కావాలంటే కొthiమీర, సాంబార్ పౌడర్ కలుపుకోవచు.

1 comment:

  1. 1.antha bagane undhi gaani kavalsina items lo chinthpandu mention cheyyaledu mari prepare chestappudu chinthapandu ela vachindhi anna? ;)
    2.enni vissils vachevaruku unchalo correctga mention cheyyaledu...clearga anni mention cheste baguntundhi :)

    ReplyDelete